telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిన్నారి మెడలో పాము వేసి… హాలీవుడ్‌ సెలబ్రెటీనిర్వాకం

Kim

ప్రముఖ హాలీవుడ్‌ టీవీ సెలబ్రెటీ కిమ్‌ కర్దాషియన్ ఎప్పుడూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మరోసారి ఈ అమ్మడు చేసిన నిర్వాకంపై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. ఈ బ్యూటీకి న‌లుగురు పిల్ల‌లు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కిమ్ తన కూతురు షికాగో వెస్ట్ మెడ‌లో పాము వేసి ఆ దృశ్యాన్ని వీడియో తీసింది. దానిని సోష‌ల్ మీడియ‌లో షేర్ చేస్తూ “మై బ్రేవ్‌ గర్ల్‌ షికాగో” అనే క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ వీడియోని చూసిన నెటిజ‌న్స్ కిమ్ క‌ర్దాషియ‌న్‌పై ఫైర్ అవుతున్నారు. అభం శుభం తెలియ‌ని చిన్నారి మెడ‌లో పాము వేసి ఇలాంటి వికృత చ‌ర్య‌లు చేయ‌డం ఏ మాత్రం క‌రెక్ట్ కాదు. విష‌పూరితమైన పాముల‌తో చెల‌గాటాలు అవ‌స‌ర‌మా ? పాములు కూడా జీవులే, వాటిని ఆట‌వ‌స్తువులుగా చూడ‌డం చాలా త‌ప్పు అంటూ నెటిజ‌న్స్ కిమ్‌కి హితబోధ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

My brave girl Chicago 🐍

A post shared by Kim Kardashian West (@kimkardashian) on

Related posts