telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆరేళ్ల క్రితం ఉన్నట్లు గా కాంగ్రెస్ ఇప్పుడు లేదు : ఖుష్బూ

Khushboo

సినీనటి ఖుష్బూ నిన్న బీజేపీ లో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో 120 కోట్ల మంది ప్రజలు ప్రధాని మోడీకి, బీజేపీ కి మద్దతుగా ఉన్నారు. ఆరేళ్ల క్రితం ఉన్నట్లు గా కాంగ్రెస్ ఇప్పుడు లేదు. రాష్ట్ర నాయకులు చెప్పిందే రాహుల్ గాంధీ వింటున్నారు. ”ఖుష్బూ కేవలం నటి మాత్రమే” అంటూ తమిళనాడు పిసిసి అధ్యక్షుడు అళగిరి చేసిన వ్యాఖ్యలు నన్ను బాధించాయు. అందం, తెలివితేటలు ఉన్న మహిళను కాబట్టే ఓర్చుకోలేకపోయారు. నా పట్ల అసూయ, ద్వేషం వెళ్లగక్కారు అని అన్నారు.

ద్రవిడ రాజకీయాలదే పైచేయిగా ఉన్న తమిళనాడులో, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మురుగన్ నేతృత్వంలో గత ఆరేళ్లుగా పార్టీ బలోపేతమైంది. అట్టడుగున క్షేత్ర స్థాయిలో బీజేపీ బలమైన పునాదులు ఏర్పాటు చేసుకోగలిగింది. రోమ్ నగరం ఒక్క రోజులోనే నిర్మాణం కాలేదు. అలాగే బీజేపీ కూడా రానున్న రోజులలో తమిళనాడు లో బలమైన పార్టీ గా ఆవిర్భవిస్తుంది. నిర్బయ, హథ్రాస్, తమిళనాడు లో 12 ఏళ్ల బాలిక పై జరిగిన అఘాయుత్యాల విషయంలో పరస్పరం నిందలు వేసుకోవడం కాదు, సమిష్టిగా ఈ దురాగాతాలను అడ్డుకోవాలి అన్నారు. నాకున్న బలం పలు భాషలలో మాట్లాడగలగడం. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించిన స్వీకరిస్తాను. ఆ మేరకు పార్టీ కోసం పని చేస్తాను. దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభం, ఇతర సమస్యల నుంచి మోడీ నాయకత్వంలో సమర్థవంతంగా బయటపడతామనే నమ్మకం నాకుంది అని ఆవిడ తెలిపారు.

Related posts