యూపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య విమానశ్రయానికి శ్రీరాముడి పేరు పెట్టాలన్న ప్రతిపాదనను యూపీ ప్రభుత్వం ఆమోదించింది. అయోధ్య విమానాశ్రయాన్ని మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయంగా మారుస్తూ మంత్రి వర్గం తాజా తీర్మానించింది. టెంపుల్ టౌన్ అయోధ్యలోని విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెడుతూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో విమానాశ్రయం నిర్మాణానికి భూసేకరణ ప్రారంభమైంది. భూసేకరణ పూర్తి కాగానే కేంద్ర పౌరవిమానయాన శాఖ విమానాశ్రయ నిర్మాణ పనులు చేపట్టనుంది. అయోధ్యకు అంతర్జాతీయ, దేశీయ టెర్మినల్స్ రెండూ ఉంటాయని, యూపీలోని అతి పెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా ఉండవచ్చని యూపీ సీఎం ఆదిత్య నాథ్ 2018 నవంబర్‌లో ప్రకటించారు. అయోధ్య విమానశ్రయానికి శ్రీరాముడి పేరు పెట్టడాన్ని పలువులు సాధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది రైతులు చెల్లించే మండీ ఫీజును 2 శాతం నుంచి ఒక శాతానికి తగ్గిస్తూ.. యోగి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అటు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
previous post
next post