విలక్షణ నటుడు, తమిళ స్టార్ హీరో విక్రమ్ తన 58వ చిత్రాన్ని అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. 7 స్క్రీన్ స్టూడియోస్, నిర్మాత లలిత్‌కుమార్ వైకం 18 స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఇటీవలే ప్రారంభమై సైలెంట్‌గా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఏప్రిల్ 2020లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ దాదాపు 25 గెటప్స్ పోషించనున్నాడట. ఈ చిత్రంతో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వెండితెర ఆరంగేట్రం చేయబోతున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక చిత్రంలో కథానాయికగా కన్నడ స్టార్ హీరోయిన్, కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టిని ఎంపిక చేశారు. దర్శకుడు అజయ్ ఈ విషయాన్ని కన్‌ఫాం చేశారు. విక్రమ్ 58వ చిత్రంతో శ్రీనిధి తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. చిత్ర దర్శకుడు అజయ్ డిమోట్ కాలనీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. రెండో చిత్రంగా ఇమ్మైక నోడిగళ్ అనే సినిమా చేశాడు. ఇవి రెండు మంచి విజయం సాధించడంతో అజయ్ మూడో చిత్రం (విక్రమ్ 58వ సినిమా)పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
previous post

