telugu navyamedia
సినిమా వార్తలు

ఆర్జే హేమంత్ కు కారు ప్రమాదం

RJ-Hemanth

ప్రముఖ రేడియో జాకీ, టీవీ యాంకర్, నటుడు హేమంత్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హేమంత్ క్షేమంగా బయటపడ్డాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్‌ మహమ్మద్‌ పేట క్రాస్‌ రోడ్డు వద్ద హేమంత్‌ కారు ఓ గేదెను ఢీ కొట్టింది. దీంతో కారు ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఆ సమయంలో అతడే కారు డ్రైవ్‌ చేస్తున్నట్లు సమాచారం. కాగా విజయవాడలో “మహర్షి” సక్సెస్‌ మీట్‌ కార్యక్రమం పూర్తి చేసుకుని హైదరాబాద్‌ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related posts