telugu navyamedia
సినిమా వార్తలు

రాఘవ లారెన్స్ కు అవమానం… “లక్ష్మీ బాంబ్” నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటన

Laxmi-Bomb

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన “కాంచన”కు హిందీ రీమేక్ గా “లక్ష్మీ బాంబ్” ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను శనివారం నాడు విడుదల చేశారు. తనకు తెలియకుండా ఈ పోస్టర్ విడుదల చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తనకు జరిగిన అన్యాయాన్ని తెలిపారు.

”గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదని తమిళంలో ఓ సామెత ఉంది. ఈ ప్రపంచంలో డబ్బు, పేరు కంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యం. నాకు ఆత్మాభిమానం ఉంది కాబట్టే “లక్ష్మీబాంబ్” ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలనుకుంటున్నాను. తప్పుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి… నా అనుమతి లేకుండా నాతో చర్చించకుండా పోస్టర్ విడుదల చేశారు… దర్శకుడిగా ఇది నాకు చాలా బాధాకరమైన విషయం. రీమేక్ సినిమా కాబట్టి స్క్రిప్ట్ వెనక్కి ఇచ్చేయాలని అడగడం లేదు. అలా అని దర్శకుడిగా సినిమాను కొనసాగించలేనని అన్నారును. నాకు అక్షయ్ కుమార్ సర్ అంటే ఎంతో అభిమానం.. అందుకే స్క్రిప్ట్ వెనక్కి తీసుకోవాలనుకోవడం లేదు. వారికి నచ్చిన దర్శకుడిని ఎంచుకోవచ్చు. త్వరలోనే అక్షయ్ కుమార్ ని కలిసి విషయం చెప్తాను” అంటూ సినిమా ఫస్ట్ లుక్ పై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Related posts