telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో “విజిల్” కలెక్షన్ల సునామీ

Bigil

తెరి, మెర్సల్ వంటి బ్లాక్ బాస్టర్ బస్టర్ హిట్స్ తరువాత అట్లీ, విజయ్ కాంబినేషన్‌లో ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ‘బిగిల్’ చిత్రం తెలుగులో విజిల్ పేరుతో విడుదలైంది. మాస్ ఆడియన్స్ మెప్పిస్తూ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన తొలి నాలుగురోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మార్క్ దాటి.. రెండొందల కోట్ల కలెక్షన్ల వైపు దూసుకువెళ్తోంది. ఒక్క ఇండియాలోనే రూ. 97.68 కోట్లను వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు విజయ్. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ విజిల్ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నాలుగు రోజుల్లో మొత్తంగా 12 కోట్ల షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. మూడోరోజు నైజాంలో 1.92 కోట్లు, సీడెడ్‌లో 1.64 కోట్లు, ఉత్తరాంధ్రలో 0.67 కోట్లు, గుంటూరులో 0.81 కోట్లు, ఈస్ట్, వెస్ట్‌లో 7.06 కోట్లు, క్రిష్ణాలో 0.44 కోట్లు, నెల్లూరులో 0.28 కోట్లు సాధించి మూడురోజులకు గాను 6.50 కోట్ల షేర్ రాబట్టింది. ఇక శని ఆదివారాలు వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్లు మరింత పుంజుకుని నాలుగో రోజు రెట్టింపు కలెక్షన్లు రాబట్టి లాభాల బాట పట్టింది ‘విజిల్’.

Related posts