తెలుగు దిగ్గజం సిరివెన్నెల సీతరామాశాస్త్రి అంత్యక్రియలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆశేష సినీ అభిమానులు మధ్య ముగిసాయి. సినీ ప్రముఖుల హాజరై, ఆయనకు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు.
గత నెల 24న న్యుమోనియాతో బాధపడుతూ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన ఆయన నిన్న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సిరివెన్నెల కన్నుమూతతో సినీ పరిశ్రమ మూగబోయింది.
అంతకుముందు బుధవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్లో ఆయన భౌతికకాయం.. అభిమానుల సందర్శనార్థం ఉంచారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున సహా సినీ ప్రముఖులందరూ సిరివెన్నెలను కడసారి చూసేందుకు అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు.