telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

కీర్తి సురేష్‍ ని నెగెటివ్ రోల్ అభిమానులు ఆదరిస్తారా..?

Keerthy-Suresh

మహానటి సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. అంతేకాకుండా అన్ని భాషలో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. దాంతో ఒక్కసారిగా టాప్ రేంజ్ కి వెళ్ళిపోయింది. అయితే కీర్తి సురేష్‌ అంటే అందం, అభినయం అనేంతగా ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. అలాంటి కీర్తి సురేష్ డీ గ్లామర్‌గా కనిపించేందుకు సిద్ధమైంది. తాజాగా కోలీవుడ్ ప్రాజెక్ట్ ‘సాని కాయుధమ్’ సినిమా లాంచ్ చేసింది. కీర్తి సురేష్ సంబంధిత ఫొటోల్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కీర్తి, డైరెక్టర్ సెల్వ రాఘవన్ లీడ్ రోల్ లో చేస్తున్నారు. సెల్వ రాఘవన్ ఈ చిత్రంతో నటుడిగా మారుతుండగా, ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ అంచలనాలను పెంచింది. క్రైమ్‌‌కు పాల్పడిన కీర్తి, సెల్వరాఘవన్ పారిపోగా.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లిస్ట్‌లో చేరిపోతారు. ఆ క్రైమ్ ఏంటి? పోలీసులు ఎలా ఛేదించారు? అనేది దర్శకుడు చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొదటిసారిగా ఇలాంటి ప్రతినాయిక పాత్ర పోషిస్తున్న కీర్తిని అభిమానులు ఆదరిస్తారా… లేదా అనేది చూడాలి.

Related posts