telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆరుదశలలో కంటివెలుగు.. తలసేమియా వ్యాధిగ్రస్తులకు 10వేల పెన్షన్..

kanti velugu launched in anathapur

నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. దశలవారీగా 5.4 కోట్ల మందికి ఈ కంటి పరీక్షలు చేయిస్తామన్నారు. మూడేళ్లలో ఆరు దశల్లో కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తామన్నారు. రూ. 560 కోట్లతో కంటి వెలుగు కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ఆస్పత్రుల్లో పరిస్థితులు పూర్తిగా మార్చివేస్తామన్నారు. వైద్యం, విద్యా, వ్యవసాయానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

జనవరి నుంచి కిడ్నీ వ్యాధిగ్రస్తులతో పాటు తలసేమియా వ్యాధిగ్రస్తులకు రూ. 10వేలు పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. హంద్రీనీవా ద్వారా అనంతపురం జిల్లా రూపు రేకలు మారుస్తామని అన్నారు. మొత్తం 2వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చుతామని సీఎం తెలిపారు. 1100 అంబులెన్స్ వాహనాల కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని జగన్ చెప్పారు.

Related posts