జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వెంటనే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌పై ఇక సర్వాధికారాలు కేంద్రానికే ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే సర్కారు నిర్ణయంపై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు.
ఆర్టికల్ 370 రద్దు జమ్మూకశ్మీర్ లో చారిత్రక మార్పులకు దారితీయనుందని వ్యాఖ్యానించారు. కశ్మీర్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రశాంత జీవనానికి భంగం కలగకపోవచ్చని ఆమె ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్విట్టర్ లో పేర్కొన్నారు.
బస్తా సిమెంట్ కన్నా ఇసుక ధర ఎక్కువ..ఇది జగన్నాటకమే: చంద్రబాబు