“ఆర్ఎక్స్ 100” చిత్రంతో యూత్ ను ఫిదా చేసిన నటుడు కార్తికేయ. ఈ తర్వాత గుణ 369, 90 ఎల్ అనే చిత్రాలలో నటించారు. కానీ ఈ చిత్రాలేవీ కార్తికేయకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం “చావుకబురు చల్లగా” అనే మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ విడుదల కాగా విశేష ఆదరణ దక్కించుకుంది. బస్తీ మాస్ కుర్రాడిగా సందడి చేయనున్నాడు. తాజాగా యంగ్ హీరో కార్తికేయ సిక్స్ ప్యాక్ లుక్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కండలు తిరిగిన కార్తికేయ దేహాన్ని చూసి అమ్మాయిలు పడిపోతున్నారు. లాక్‌డౌన్ సమయంలో కార్తికేయ తన శరీరంపై పూర్తి దృష్టి పెట్టి సిక్స్ ప్యాక్‌తో తన అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు.
Hero @ActorKartikeya seemed to make the best out of his #QuarantineTimes to transform his body for the upcoming projects. pic.twitter.com/GUh1DyUbqp
— BARaju (@baraju_SuperHit) May 27, 2020