telugu navyamedia
రాజకీయ

రాజకీయ వేడితో.. మాటల యుద్ధం.. : జావేద్ అక్తర్ పై కర్ణిసేన కన్నెర్ర

karnisena fire on javath ahktar

మహారాష్ట్ర కర్ణిసేన చీఫ్ జీవన్ సింగ్, ప్రముఖ సినీ గేయ రచయిత జావేద్ అక్తర్ పై మండిపడ్డారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పకపోతే కళ్లు పీకేస్తామనీ, నాలుక కోస్తామని హెచ్చరించారు. ఇంటిలోకి దూసుకొచ్చి చితకబాదుతామని బెదిరించారు. శ్రీలంక ఉగ్రదాడుల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం తరహాలో భారత్ లోనూ ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాలను నిషేధించాలని శివసేన కోరింది. దీని తో ఒక్క బుర్ఖాలే ఎందుకు?.. మహిళలు తలపై కొంగును కప్పుకునే విధానాన్ని కూడా నిషేధించాలని జావేద్ అక్తర్ సూచించారు.

ఈ విషయమై జీవన్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. ‘మూడు రోజుల్లోగా క్షమాపణలు తెలపాలని జావేద్‌కు చెప్పాం. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశాం’ అని చెప్పారు. పద్మావతి సినిమా సమయంలోనూ కర్ణిసేన ఓ రేంజ్ లో గందరగోళం సృష్టించింది. పలు థియేటర్లపై దాడిచేయడంతో పాటు దేశవ్యాప్తంగా కర్ణిసేన సభ్యులు అందోళనకు దిగారు.

Related posts