telugu navyamedia
రాజకీయ వార్తలు

కర్ణాటకలో అసెంబ్లీ ఉప ఎన్నికలు వాయిదా!

evm issues even in 4th schedule polling

కర్ణాటక రాష్ట్రంలో 15 అసెంబ్లీ స్ధానాలకు జరిగే ఉప ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఉప ఎన్నికల్లో తమను కూడా పోటీకి అనుమతించాలని కోరుతూ అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు పిటిషన్‌ దాఖలు చేశారు. వారి పిటిషన్‌ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు అంగీకరించడం తెలిసిందే. ఈ అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడే వరకు వేచి చూస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు ఎన్నికలను వాయిదా వేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Related posts