మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెప్పారు. ఈ తీర్పు చారిత్రాత్మకమని, బలపరీక్షలో విపక్షాలదే విజయమని ఆమె అన్నారు. సుప్రీం తీర్పు పై శివసేన నేతలు స్పందిస్తూ ఇది ప్రజాస్వామ్య విజయమని అన్నారు.
కాగా, ఎన్సీపీ నేతలతో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ సమావేశమయ్యారు. రేపటి బలపరీక్షపై చర్చిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ కలిశారు. బలపరీక్ష నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. తమకు 162 మంది ఎమ్మెల్యేల బలం ఉందని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ చెబుతోంది.
యురేనియం తవ్వకాల పై స్పందించిన అఖిలప్రియ