కంగనా రనౌత్ ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. అయితే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తలో నిలిచారు. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ముంబై మాజీ పోలీసు చీఫ్ పరం బీర్ సింగ్… హోంమంత్రి దేశ్‌ముఖ్ మీద చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు సోమవారం ఆదేశించింది. 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ నిర్వహించాలని హైకోర్టు సీబీఐని ఆదేశించింది. దీంతో అనిల్ దేశ్‌ముఖ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందించిన కంగనా అనిల్ దేశ్ ముఖ్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. స్త్రీలను వేధించి, హింసించేవారికి, సాధువులను హత్య చేసే వారికి పతనం తప్పదు. ముందు ముందు ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. ఇది ఆరంభం మాత్రమే అంటూ కంగనా ట్వీట్ చేశారు. అంతేకాదు గతంలో తన ఆఫీసు కూల్చివేతకు సంబంధించిన ట్వీట్లను రీట్వీట్ చేసింది. కంగనా తాజాగా తన వ్యాఖ్యలతో మరోసారి సంచలనం సృష్టించింది.
previous post
next post

