telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విపత్తుల నిర్వహణకు .. సరికొత్త వాహనాలు..

new vehicles for disaster management

తెలంగాణ ప్రభుత్వం విపత్తులను సమర్థవంతగా ఎదుర్కొనేందుకు అత్యాధునిక పరికరాలతో కూడిన వాహనాలను రంగంలోకి దింపింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) బృందాలు వచ్చేలోగానే ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా వీటిని సిద్ధం చేశారు. ప్రకృతి విపత్తులు, భారీ ప్రమాదాలు జరిగినప్పుడు సహజంగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపడతాయి. అత్యంత భారీ సంఘటనలు జరిగినప్పుడే వీటిని రంగంలోకి దింపుతారు. మామూలు ఘటనలు జరిగినప్పుడు మాత్రం మున్సిపల్‌ సిబ్బంది, పోలీసు, ఫైర్‌ తదితర విభాగాలే సహాయక చర్యలు చేపడతాయి. ఆయా విభాగాలు సరియైన సమయంలో స్పందించకపోవడం, ఒకవేళ సమయానికి చేరుకున్నా వారివద్ద అవసరమైన యంత్ర సామగ్రి లేకపోవడంవల్ల సహాయక చర్యల్లో ఇబ్బందులు తలెత్తడం సహజం. ఉదాహరణకు ఇటీవల కాచిగూడలో రైలు ప్రమాదం సంభవించగా అందులో చిక్కుకుపోయిన కోపైలెట్‌ను రక్షించడంతోపాటు సహాయక చర్యలు చేపట్టేందుకు రైల్వేశాఖ వద్ద సమయానికి యంత్రసామగ్రి కొరత ఏర్పడింది. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీకి చెందిన డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెంటనే తమ యంత్ర సామగ్రితో అక్కడికి చేరుకొని సహాయక చర్యలు నిర్వహించాయి. రైల్వే సహాయక సిబ్బంది సైతం జీహెచ్‌ఎంసీకి చెందిన డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది యంత్ర పరికరాలనే ఉపయోగించడం విశేషం.

వాహనాల ప్రత్యేకతలు : ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాథమిక చికిత్సను అందించేందుకు మెడికల్‌ కిట్‌; ప్రమాదాల వద్ద రక్షణకు ధరించేందుకు సేఫ్టీ హెల్మెట్‌లు; ఇనుప కడ్డీలు, లోహపు వస్తువులను కత్తిరించేందుకు గ్యాస్‌ కట్టర్లు; నీటిని బయటకు తోడిపోసేందుకు పంప్‌సెట్‌; కూల్చివేతలకోసం డిమాలిషన్‌ హామర్‌; స్లాబులను కత్తిరించేందుకు స్లాబ్‌ కట్టర్‌; మంటలను ఆర్పేందుకు ఫైర్‌ బాల్స్‌; మంటలు అంటుకోకుండా సహాయక సిబ్బంది ధరించేందుకు ప్రత్యేకమైన ఫైర్‌ సూట్‌ * సేఫ్టీనెట్‌, రోప్‌ లాడర్‌, ఎలక్ట్రిక్‌ కట్టర్లు తదితర 13రకాల పరికరాలు; 500మీటర్ల వరకూ వెలుతురును ప్రసరింపజేసే ఆస్కాలైట్లు, రాత్రివేళల్లో దాదాపు 20అడుగుల ఎత్తుకు, అలాగే 500మీటర్ల దూరం వరకు ఆటోమేటిక్‌గా వెలుతురును ప్రసరింపజేయడం ఈ ఆస్కాలైట్‌ ప్రత్యేకత.

Related posts