అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, ఆలియా భట్, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం “కళంక్”. తాజాగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేశారు చిత్రబృందం. 1945లో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఓ యువరాణికి, ఓ సాధారణ వ్యక్తికి మధ్య పుట్టిన ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రూప్ అనే యువరాణి ఆలియా పాత్రలో నటించారు. టీజర్ లోని ప్రతి సన్నివేశం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. “ఒకరిని నాశనం చేస్తేనే అది మన విజయం అవుతుందంటే.. ఈ ప్రపంచంలో మనకంటే ఓటమిపాలైనవారు మరొకరుండరు” అంటూ టీజర్‌లో వచ్చే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఏప్రిల్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీతనం, విజువల్స్ తో “బాహుబలి”ని టార్గెట్ గా పెట్టుకుని, బాహుబలిని మించి హిట్ సాధించాలనే పట్టుదలతో ఈ సినిమాను తీసినట్టుగా కన్పిస్తోంది. అంతేకాదు కొన్ని సన్నివేశాలు కూడా బాహుబలికి దగ్గరగా ఉన్నాయి. ఉదాహరణకు హీరో ఆ దున్నపోతుతో ఫైటింగ్ చేయడం. టీజర్ కు అయితే మంచి స్పందనే వస్తోంది. మరి సినిమా బాహుబలి రికార్డులను అధిగమిస్తుందో లేదో చూడాలి. మీరు కూడా ఈ టీజర్ ను చూసేయండి మరి.
previous post