telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ ను పెళ్ళి చేసుకుంటానంటున్న చందమామ…!

Kajal

అందాల చందమామ కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. కాజ‌ల్ ఇటీవలే కోమ‌లి, రణ‌రంగం చిత్రాలతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో “కోమలి” చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. బాలీవుడ్లో ” ముంబై స‌గ” అనే చిత్రంలో జాన్ అబ్ర‌హంతో రొమాన్స్ చేయ‌నుంద‌ట‌. సంజ‌య్ గుప్తా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ కీల‌క పాత్ర‌లు పోషించ‌నున్నార‌ని స‌మాచారం. క ఆమె న‌టించిన‌ “పారిస్ పారిస్” కూడా విజయం సాధిస్తుందని కాజల్ ధీమాగా ఉంది. మరోవైపు కమల్-శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం “భారతీయుడు-2″లో నటిస్తోంది. ఇదీ కాక శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సూర్యతో జ‌త‌క‌ట్ట‌నుంది కాజ‌ల్‌. “కాల్ సెంటర్” అనే మరో చిత్రంలో కూడా నటిస్తోంది. తాజాగా ఆమె మంచులక్ష్మి హోస్ట్‌గా చేస్తోన్న ‘ఫిట్ అప్ విత్ స్టార్స్’ అనే ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఈ షో ఆన్ లైన్ స్ట్రీమింగ్ సైట్ వూట్‌లోప్రసారం అవుతోంది. ఈ రియాలిటీషో పాల్గొన్న కాజల్ తన నట జీవితంలో ఎదుర్కోన్న పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగా.. కాజల్ అగర్వాల్ తో మంచు లక్ష్మీ… రామ్‌చరణ్‌, తారక్‌, ప్రభాస్‌లలో ‘ఎవరిని చంపుతారు? ఎవరితో రిలేషన్‌లో ఉంటారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారని ప్రశ్నించగా, కాజల్ స్పందిస్తూ.. రామ్‌ చరణ్‌ను చంపేస్తానని, ఎన్టీఆర్‌తో రిలేషన్‌లో ఉంటానని, ప్రభాస్‌ను మాత్రం పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు పెళ్లి అవడంతో ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఒక్కరు కావడంతో ప్రభాస్‌నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది చందమామ.

Related posts