telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

వాహనదారులపై మరో పిడుగు.. మరోసారి పెరిగిన పెట్రోల్‌ ధరలు

ఇండియాలో పెట్రోలు, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా మరోసారి డీజిల్‌, పెట్రోలు ధరలు పెరిగిపోయాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్‌ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసల మేర పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.  ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.11 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.65 కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సెంచరీకి చేరింది. లీటర్ పెట్రోల్ ధర రూ. 104.22 చేరగా.. డీజిల్ ధర రూ. 96.16 కు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.96 చేరగా.. డీజిల్ ధర రూ. 96.63 కు చేరింది. ఇటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. విజయవాడ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ ధర రూ. 104.50 గా నమోదైంది.

Related posts