రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయంటూ ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటనతో అమరావతి రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. రైతులు తమ బాధలను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చెప్పుకోవడానికి మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
ప్రభుత్వ వైఖరి, పోలీసుల లాఠీచార్జితో పాటు పలు విషయాలపై వారు పవన్ కు తెలుపనున్నారు. తమ తరఫున పోరాడాలని జనసేనానికి రైతులు కోరనున్నారు. కాసేపట్లో రైతులతో పవన్ చర్చించి, ఆ తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. బీజేపీతో కలిసి పోరాడతామని ఇప్పటికే జనసేన పార్టీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.