telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పల్లాను గెలిపిస్తే కేసీఆర్‌ గ్లాస్ లో సోడా పోశాడు : బండి సంజయ్‌

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి టీఆర్‌ఎస్‌ నిప్పులు చెరిగారు. తెలంగాణలో రాక్షస పాలన, గడీల పాలన కొనసాగుతోందని బండి సంజయ్ ఫైర్‌ అయ్యారు. నల్లగొండ కలెక్టరేట్ లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. నీచ రాజకీయాలకు సమాధి కట్టాలన్న టీఆర్‌ఎస్ పార్టీ మెడలు వంచాలన్నా, దమ్మున్న బీజేపీని గెలిపించాలని కోరారు. అమరవీరుల రక్తపు మడుగులో అధికారంలోకి వచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించకుండా సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్ కు పరిమితం అయ్యారని మండిపడ్డారు. ఉపాధ్యాయులను మోసం ప్రభుత్వం చేసిందని… వారి కోసం జైలు కెళ్లిన బీజేపీని ఈ ఎన్నికల్లో గెలిపిస్తే పీఆర్సీ వస్తుందన్నారు. ఉద్యమాల పురిటి గడ్డగా నిలిచిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల్లో పట్టభద్రులు ఆలోచించాలని కోరారు. జీహెచ్ ఎంసీలో బీజేపీని గెలిపిస్తే ఎల్ఆర్ఎస్ పారిపోయిందని… ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే నోటిఫికేషన్, పీఆర్సీ వస్తాయి, సీఎం బయటకు వస్తారని తెలిపారు. పల్లాను గెలిపిస్తే సీఎం ఫామ్ హౌస్ కు వెళ్లి గ్లాస్ లో సోడా పోశారని.. టీఆరెస్ పార్టీ ఓడిపోతుందనే మళ్ళీ పల్లాకే టికెట్ ఇచ్చారని పేర్కొన్నారు.

Related posts