telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నాయకులు నియంతలుగా మారితే ప్రజలు గుణపాఠం చెబుతారు: పవన్

నాయకులు నియంతలుగా మారితే ప్రజలు గుణపాఠం చెబుతారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో ఆయన మాట్లాడుతూ విలువలతో రాజకీయాలు చేయబట్టే జనసేన ఓడిపోయిందని అన్నారు. జనసేన పార్టీకి ఎన్నో సమస్యలు ఉన్నాయని, తమలో తప్పులు ఉంటే సలహాలు ఇవ్వాలని ఎన్నారైలకు పవన్ సూచించారు. ప్రతి ఓటమి నుంచి ఓ పాఠం నేర్చుకుంటున్నానని అన్నారు.

జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయనున్నానని అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలుగా ప్రజలు విడిపోరాదని పిలుపునిచ్చారు. మనుషులను కలిపేలా జనసేన రాజకీయాలు ఉంటాయని స్పష్టం చేశారు. డబ్బులు లేకుండా రాజకీయాలు చేయడం కష్టమని తనకు తెలుసు అని అన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తులే బయట తిరుగుతున్నారని, అలాంటప్పుడు తాను రాజకీయాల్లో కొనసాగితే తప్పేంటని ప్రశ్నించారు. అపజయం తనను మరింత బలోపేతం చేసిందని పవన్ పేర్కొన్నారు.

Related posts