గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో రాజ్యాంగ పాత్రను ఆయన గుర్తు చేసుకున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ను నిలపడంలో రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించింది.
ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాల్లో మన రాజ్యాంగం ఒకటి. దేశ పౌరుల హక్కులను పరిరక్షించడంలో, ఇంతటి గొప్ప రాజ్యాంగాన్ని మనకందించిన మహనీయులను స్మరించుకుంటూ దేశ పౌరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’ అని జగన్ ట్వీట్ చేశారు.
ట్రయల్ మొదలైతే జగన్ దృష్టంతా కోర్టు బోనుపైనే: యనమల