ఏపీలోని చిత్తూరు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగులు తరచూ బీభత్సం సృష్టిస్తుంటాయి. గుంపులు గుంపులుగా గ్రామాల్లోకి వస్తూ పంట పొలాలను నాశనం చేయడంతోపాటు మనుషుల ప్రాణాలను కూడా తీస్తుంటాయి.
ఏనుగుల బీభత్సకాండపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా ఏనుగుల సమస్యకు చెక్ పెట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.
కుంకీ ఏనుగులు అనేవి శిక్షణ పొందిన ఏనుగులు. వీటిని అడవి ఏనుగులను ట్రాప్ చేయడానికి వినియోగిస్తారు.
గ్రామాల్లోకి వచ్చే ఏనుగులను కుంకీ ఏనుగుల ద్వారా తరిమివేస్తారు.
దానిలో భాగంగానే బెంగళూరులో పర్యటించిన అటవీశాఖ మంత్రిగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివ కుమార్ తో భేటీ అయ్యారు.
ఏడు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లోని ఏనుగుల బెడదను కర్నాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బీ ఖండ్రే దృష్టికి తీసుకెళ్లారు.
ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి పంటలను నాశనం చేయడంతోపాటు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని ఆయనకు తెలియజేశారు.
గ్రామాల్లోకి వచ్చి బీభత్సం సృష్టించే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
కర్నాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కర్నాటక అటవీశాఖ మంత్రి- పవన్కళ్యాణ్ సమావేశం తర్వాత.. ఏపీకి ఎనిమిది కుంకీ ఏనుగులు ఇచ్చేందుకు అంగీకరించింది కన్నడ ప్రభుత్వం.
ఆర్టికల్ 257 కింద రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చర్యలు: యనమల