బిగ్ బాస్ తెలుగు 3 రియాల్టీ షో క్లైమాక్స్‌కు చేరింది. 3 నెలల క్రితం 15 మంది ఇంటి సభ్యులతో మొదలైన బిగ్ బాస్ ప్రయాణం ఆఖరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ టికెట్ టూ ఫినాలే గెల్చుకుని ఫైనల్‌కు చేరుకున్నాడు. మిగిలిన ఐదుగురు నామినేషన్‌లో ఉండగా.. ప్రజల ఓట్ల ద్వారా శుక్రవారం బాబా భాస్కర్ కూడా టికెట్ టూ ఫినాలే సాధించాడు. ఇక శ్రీముఖి, శివ జ్యోతి, వరుణ్ సందేశ్, అలీ రెజా ప్రస్తుతం నామినేషన్లో ఉన్నారు. ఐతే వీరిలో శివజ్యోతిగానీ, అలీ గానీ ఇంటి నుంచి వెళ్లిపోయే అవకాశం ఉందని అంటున్నారు. శివజ్యోతి ఎలిమినేట్ అయితే ఫినాలేలో శ్రీముఖి, రాహుల్, వరుణ్, అలీ, బాబా భాస్కర్ ఉంటారు. మరి వీరిలో ఎవరు టైటిల్ విన్నర్.. అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఫ్యాన్స్ తమ అభిమాన కంటెస్టెంట్ కోసం గ్రూపులుగా ఏర్పడి పోటాపోటీగా ఓట్లు వేస్తున్నారు. ఈ క్రమంలో సినీ సెలబ్రిటీలు సైతం వారికే తమ మద్దతంటూ సోషల్ మీడియాలో వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. యాంకర్, ఆర్జే నోయల్… రాహుల్ సిప్లిగంజ్‌కు సపోర్ట్ చేస్తున్నాడు. యాంకర్ రవి… అలీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇక తెలుగు బుల్లితెర సంచలనమైన జబర్దస్త్ టీమ్ యాంకర్ శ్రీముఖికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే యాంకర్ రష్మి.. శ్రీముఖికి ఓట్లువేయాలంటూ అభిమానులకు విజ్ఞప్తి చేసింది. తాజాగా ఆటో రాంప్రసాద్ సైతం శ్రీముఖికి మద్దతుగా టిక్‌టాక్‌లో వీడియో పెట్టాడు. జబర్దస్త్ కమెడియన్స్‌తో శ్రీముఖికి మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. జబర్దస్త్‌లో నటించే చాలా మంది కమెడియన్లు.. శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించిన పటాస్ షోలో పాల్గొన్నారు. అంతేకాదు పలు స్టేజి షోలపైనా ప్రదర్శనలు ఇచ్చారు. అలా వారి మధ్య మంచి సంబంధమే ఏర్పడింది. ఈ క్రమంలోనే శ్రీముఖికి జైకొడుతోంది జబర్దస్త్ బృందం. బిగ్ బాస్ ఫైనల్‌లో విన్నర్ అవ్వాలని కోరుకుంటోంది. శ్రీముఖికి ఓట్లు వేయాలని పోస్టులు పెడుతున్నారు. మరి విన్నర్ ఎవరవుతారనే విషయం త్వరలోనే తేలనుంది.
previous post