telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మళ్లీ మల్లారెడ్డి కుటుంబంపై ఐటీ దాడులు – భద్రారెడ్డి నివాసంలో తనిఖీలు

నియోజకవర్గంలోని కొంపల్లిలో మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి  కుమారుడు సీహెచ్ భద్రారెడ్డి  రాజభవనంపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు ఇవాళ (గురువారం, జులై24) సోదాలు నిర్వహించారు.

మల్లారెడ్డి హాస్పిటల్స్, సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఆర్థిక లావాదేవీలను కొన్ని రోజుల క్రితం తనిఖీ చేశారు.

మళ్లీ ఇవాళ ఈ సోదాలు చేపట్టడం చర్చానీయాంశంగా మారింది. ఐటీ అధికారులు. అనుమానితంగా భారీ స్థాయిలో నగదు లావాదేవీల గురించి సమాచారం అందిన నేపథ్యంలో ఐటీ అధికారుల బృందం మల్లారెడ్డి హాస్పిటల్ చైర్మన్ భద్రారెడ్డి నివాసంలో సోదాలు చేసినట్లు తెలిపారు.

ఆన్‌లైన్, నగదు రూపంలో ఇటీవల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అధికారులు ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించారు.

ఈ దాడిలో ఐటీ అధికారులు ఆ సంస్థలో పనిచేసే సిబ్బంది మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుని, వారిని ఇంట్లోనే ఉండాలని సూచించినట్లు సమాచారం.

గతంలో ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మల్లారెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆస్తులపై దాడులు నిర్వహించి లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు.

ముఖ్యంగా రెండు రోజుల క్రితం భద్రారెడ్డి భార్య ప్రీతిరెడ్డి హైదరాబాద్‌లో బీజేపీ నాయకులను కలిశారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆమె సహచరులు బీజేపీ నాయకులు చిత్రీకరించిన బ్యానర్‌లను కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే ఆమె నివాసంపై దాడులు జరిగాయి.

Related posts