telugu navyamedia
వార్తలు సామాజిక

కరోనా ను ఎదుర్కొనే శక్తిమంతమైన మందు లేదు: బిల్ గేట్స్

Bill Gates speaks during an interview with Reuters in London

కరోనా ను ఎదుర్కొనే శక్తిమంతమైన మందు లేదని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని భావిస్తున్న నేపథ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరుగులేని కరోనా వ్యాక్సిన్ రావాలంటే కనీసం 9 నెలల నుంచి రెండేళ్ల సమయం పట్టొచ్చని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతమున్న కొన్ని ఔషధాలు శక్తిమంతమైనవే అయినా, ప్రపంచ మానవాళిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకువచ్చేంత సమర్థత వాటికి లేదని తన బ్లాగ్ లో వివరించారు. కొవిడ్-19పై కచ్చితంగా పనిచేస్తుందని చెప్పగల ఔషధమంటూ ఏదీ లేదన్నారు. ఈ నేపథ్యంలో భూమండలంపై ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయడం అత్యంత అవసరం అని స్పష్టం చేశారు. కరోనా బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వందల కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్ డోసుల్ని అభివృద్ధి చేయాల్సి ఉందని, ఎంత వీలైతే అంత త్వరగా ఈ ప్రక్రియ జరగాలని బిల్ గేట్స్ వివరించారు.

Related posts