telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధుల నిలిపివేత: ట్రంప్ కీలక నిర్ణయం!

trump usa

కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రపంచానికి సరైన సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సమాచారాన్ని అందించలేద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇక పై డబ్ల్యూహెచ్ఓ కు అమెరికా నుంచి అందుతున్న నిధులను నిలిపివేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఇక ఆ మిగులు నిధులను ఎలా సద్వినియోగం చేయాలన్న విషయమై ఆలోచనలు చేస్తామని ఆయన తెలిపారు.ఆర్థిక ఇబ్బందులు పడుతున్న దేశాలను ఆదుకోవాలని డబ్ల్యూహెచ్ఓ భావించడం లేదని ట్రంప్ ఆరోపించారు.

చైనా నుంచి వచ్చిన సమాచారాన్ని వచ్చినట్టుగా చెప్పిందే తప్ప, ఏ మాత్రమూ వాస్తవ పరిస్థితులను డబ్ల్యూహెచ్ఓ అంచనా వేయలేదని ఆరోపించిన డొనాల్డ్ ట్రంప్, వారిచ్చిన తప్పుడు సమాచారం కారణంగానే, కరోనా కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 20 రెట్లు పెరిగిందని అన్నారు. ఇకపై ఆ సంస్థకు తమ నుంచి నిధులు అందించలేమని స్పష్టం చేశారు.

గత సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు అమెరికా 400 మిలియన్ డాలర్ల నిధులను అందించింది. ఇక అమెరికా తీసుకున్న నిర్ణయంపై స్పందించిన ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్, ఆర్థిక వనరులను తగ్గించడానికి ఇది సరైన సమయం కాదని అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ పై పోరాడి గెలవాల్సిన పరిస్థితిలో ప్రపంచం ఉందని, ఇందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని తెలిపారు.

Related posts