telugu navyamedia
రాజకీయ వార్తలు

ఇస్రో బృందం శ్రేష్ఠమైన పనితీరును కనబరిచింది: రాష్ట్రపతి రామ్‌నాథ్

Ram Nath Kovind

చంద్రయాన్-2 ప్రయోగం చివరి ఘట్టంలో విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు అందకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తల్లో నెలకొన్న నిరాశను తొలగించేందుకు పలువురు వారికి భరోసాను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించారు.

చంద్రయాన్-2 ప్రయోగం ద్వారా ఇస్రో బృందం శ్రేష్ఠమైన పనితీరును కనబరిచిందని అన్నారు. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరం వరకు సవ్యంగా సాగిన ల్యాండర్ ప్రయాణం అక్కడి నుంచి సంకేతాలు ఆగిపోయాయి. ఇస్రో శాస్త్రవేత్తలు అంకితభావం, సాహసోపేతమైన కృషి చేశారని కొనియాడారు. భవిష్యత్‌లో సంపూర్ణ విజయాలు సాధిస్తామని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు.

Related posts