telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు… సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఇవాళ ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశానికి మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, హరిప్రియ, సండ్ర వెంకట వీరయ్య.. ఇతర అధికారులు  హాజరయ్యారు.. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. అటు గోదావరి, ఇటు కృష్ణా నదుల మధ్య ఉన్న ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకే సీతారామ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్టు వెల్లడించారు. దుమ్ముగూడెం పాయింట్ వద్ద గోదావరి నదిలో ఏడాది పొడవునా పుష్కలమైన నీరు అందుబాటులో ఉంటుంది.. ఈ నీటి ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీరు అందించవచ్చన్నారు. దుమ్ముగూడెం నుంచి నీటిని ఎత్తి పోసి అటు ఇల్లందు వైపు, ఇటు సత్తుపల్లి వైపు, మరోపక్క పాలేరు రిజర్వాయర్‌కు లిఫ్టులు, కాల్వల ద్వారా నీటిని తరలించాని సూచించారు. ఇక, సత్తుపల్లి, ఇల్లందు వైపు వెళ్లే కాలువలకు సంబంధించిన మిగిలిన పనుల సర్వే వెంటనే పూర్తి చేసి, టెండర్లు పిలవాల‌ని ఆదేశించారు సీఎం కేసీఆర్. మున్నేరు, ఆకేరు వాగులపై అక్విడెక్టులను నిర్మించి, పాలేరు రిజర్వాయర్ వరకు కాల్వల నిర్మాణాన్ని జూన్ నెల నాటికి పూర్తి చేయాలన్న ఆయన.. కృష్ణా నదిలో నీళ్లు ఎప్పుడుంటాయో, ఎప్పుడుండవో తెలియని అనిశ్చిత ప‌రిస్థితి ఉంటుంది.. అందుకే గోదావరి నుంచి తెచ్చే నీటి ద్వారా ఆయకట్టుకు నీరందించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. చూడాలి మరి ఈ పనులు అన్ని ఇప్పటివరకు ముగుస్తాయి అనేది.

Related posts