telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ప్రజలకు ఆ విషయంలో వెసులుబాటు కల్పించిన అధికారులు…

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సెగ భారీగా పెరుగుతోంది. అయితే ఎన్నికల సంఘం మంచి జోష్‌తో ఏర్పాట్లను చూస్తోంది. ఇటీవల దీనికి సంబంధించిన ఓటర్ల జాబితాను పోలింగ్ బూత్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటిలో పేరు తప్పుగా ఉన్నా, మార్పులు చేయించుకోవాలన్నా దరఖాస్తు పెట్టడం మార్చుకోవచ్చని అదికారులు తెలిపారు. అయితే ఈ ఓటర్ల జాబితాలో మీరు ఉందా, లేదా అనేది చూసుకోవాలన్నా, మరే ఇతర సవరణలు జరిపించాలనుకున్నా అందుకు అదికారులు అవకాశం కల్పించారు. దీనికి సంబంధించిన సవరణ, అభ్యంతరాల పత్రాల స్వీకరణతోపాటుగా నూతన ఓటరు కార్డును నమోదు చేసుకునేందుకు డిసెంబరు 15 దాకా అవకాశం ఇచ్చింది. నియోజకవర్గం అధికారులు ముసాయిదా జాబితాను కూడా విడుదల చేశారు. అయితే భారత దేశ రాజ్యాంగం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఓటు హక్కు కల్పిస్తోంది. అయితే 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కు కోసం జనవరీ 1, 2021 వరకూ ధరకాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. ప్రతి సంవత్సరం నవంబరు, డిసెంబరు నెలల్లో ఓటరు నమోదును మొదలు చేస్తారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది పెట్టరన్న అనుమానాలూ ప్రజల గుండెల్లో రేకెత్తాయి. అయితే ఎన్నికల సంఘం ఎప్పటి లాగానే ఓటరు నమోదును మొదలు పెట్టారు. అయితే ఈ ఏడాది దరఖాస్తులలో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా మార్సులు చేయించాలన్నా డిసెంబరు 15 వరకు అవకాశం ఉంది. ఆ తరువాత జనవరీ 14న మొదటి జాబితాను విడుదల చేస్తారు

Related posts