telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఇంటెలిజెన్స్ హెచ్చరిక : మూడునాలుగు రోజులలో .. పుల్వామా తరహా భారీ దాడులు..!

intelligence warning on terrorist attacks

ఉగ్రవాద సంస్థలు జమ్ము కశ్మీర్‌లో భీకర దాడులు చేసేందుకు భారీ కుట్ర పన్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వెంబడి భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. శిక్షణ పొందిన ఉగ్రవాదులు రెండు బృందాలుగా విడిపోయి ఎల్‌వోసీ నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కోట్లీ ఉగ్రవాద స్థావరం నుంచి అధీనరేఖ ప్రాంతంలోని నిఖియాల్ సెక్టార్‌కు ఐదుగురు టెర్రరిస్టుల బృందం ఒక వాహనంలో వచ్చింది. ఈ గ్రూప్‌నకు హాజీ అరీఫ్ అనే గైడ్ సహకారం అందిస్తున్నాడు.

జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన ఆరుగురు టెర్రరిస్టుల కదలికలను ఎల్‌వోసీకి సమీపంలోని మోహ్ర ష్రీడ్ గ్రామంలో గుర్తించారు. వీరంతా సరైన సమయం చూసుకొని భారత్‌లోకి చొరబడేందుకు వేచిచూస్తున్నట్లు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. వీరందరికి పాకిస్థాన్ ఆర్మీకి చెందిన కొంతమంది స్పెషల్ సర్వీస్ గ్రూప్ సభ్యులు, అన్ని విధాల సహకరిస్తూ.. నియంత్రణ రేఖ దాటించేందుకు సహయపడుతున్నారు.

జమ్ము కశ్మీర్‌లో మరో 3-4 రోజుల్లో భారీ ఆయుధాలతో పుల్వామా తరహా దాడిని చేసేందుకు పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు రెడీగా ఉన్నారని, ఈ నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. జైషే మహ్మద్ సంస్థ దాడికి ప్లాన్ చేసినట్లు నిఘా వ‌ర్గాల స‌మాచారం.

Related posts