telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎంగేజ్మెంట్ చేసుకున్న నయనతార !

నయనతార లేడీ రోల్‌ చాలా సినిమాలు తీసింది. దీంతో నయనతార ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. లేడి సూపర్‌ స్టార్‌గా నయన్‌ తన కెరీర్‌ను ఇంకా హై రేంజ్‌ తీసుకుంది. అయితే.. తాజాగా నయనతార పెళ్లి విషయంపై ఓ వార్త వైరల్ అవుతోంది. అది ఏంటంటే.. విఘ్నేశ్ తో ఏడు అడుగులు వేయటానికి ముహూర్తం నిర్ణయించేసుకుందట లేడీ సూపర్ స్టార్. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లోనూ నయనతార చేతికి ఉంగరం ఉన్న ఓ ఫోటోను పెట్టి… తమకు ఎంగేజ్ మెంట్ అయ్యిందనే అర్థం వచ్చేలా కాప్షన్ పెట్టాడు విఘ్నేష్ శివన్. అయితే… నెటిజన్లు మాత్రం ఇలాంటి చాలానే చూశాంలే… విషయం చెప్పండి అంటూ రాగాలు తీస్తున్నారు. అన్నట్టు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నయనతారతో పాటు సమంత కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇక మొత్తానికి త్వరలోనే నయనతార, విఘ్నేష్‌ శివన్‌ పెళ్లిపై త్వరలోనే క్లారిటీ రానుందని తెలుస్తోంది.

Related posts