telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

యూఎస్‌ ఎలక్షన్స్‌ : విజయానికి చేరువలో బైడెన్‌

అమెరికాలో ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రత్యర్థి బైడెన్‌ హోరా హోరీగా తలపడుతున్నారు. అయితే.. డెమొక్రటిక్‌ అభ్యర్థి బైడైన్‌ కీలక రాష్ట్రాలను గెలుచుకుంటూ వెళ్తున్నారు. తాజాగా మిషిగన్‌ (16)లో బైడెన్‌ విజయం సాధించారు. ఈ గెలుపుతో బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. దీంతో శ్వేత సౌధానికి వైపుగా బైడెన్‌ అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ట్రంప్‌ 214 ఓట్లు సాధించారు. మిషిగన్‌ ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు ట్రంప్‌ అక్కడి రాష్ట్ర కోర్డులో దావా వేశారు. ఓటింగ్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని రిపబ్లిక్‌ ప్రచార బృందం దావాలో పేర్కొంది. కాగా..అమెరికా ఎన్నికల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ 270.  ఇప్పటి కే న్యూమెక్సికో, న్యూహ్యాంప్‌ షైర్‌, న్యూయార్క్ మాసాచుసెట్స్‌, మేరీల్యాండ్‌, వెర్మోంట్, ఇలియనాస్‌ రాష్ట్రాల్లో బైడెన్‌ విజయం సాధించారు. ఇక అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌…. వ్యోమింగ్‌, కన్సాస్‌, మిస్సోరి, మిసిసిపీలో విజయం సాధించారు.  దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే…

Related posts