దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 18,870 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,37,16,451కి చేరింది. కరోనా నుంచి కొత్తగా 28,178 మంది కోలుకోగా, ఇప్పటివరకు మొత్తం 3,29,86,180 మంది రికవర్ అయ్యారు. ఇక, భారత్‌లో కరోనాతో గడిచిన 24 గంటల్లో 378 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,47,751 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన బులిటెన్‌లో పేర్కొన్నది.
ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 2,82,520 మందికి చికిత్స అందుతోంది. కేరళలో నిన్న 11,196 కరోనా కేసులు నమోదయ్యాయి. 149 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో నిన్న 54,13,332 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. ఇప్పటివరకు వినియోగించిన మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 87,66,63,490 గా ఉంది.