telugu navyamedia
రాజకీయ వార్తలు

లడఖ్ లో ఉద్రిక్తత.. భారత్-చైనా సైనికుల మధ్య గొడవ

kashmir police firing

కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. భారత ఆర్మీ పెట్రోలింగ్ పట్ల చైనా సైనికులు అభ్యంతరం తెలిపారు. దీంతో సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల సైనికులు ఒకరిని మరొకరు తోసుకున్నారు. అంతలోనే ఉన్నతాధికారులు స్పందించడంతో ఈ ఘర్షణాత్మక వాతావరణం కాస్తా సద్దుమణిగింది. లడఖ్ లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద భారత బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో సైనికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే ఇరుదేశాలకు సంబంధించి బ్రిగేడియర్ స్థాయి ఆర్మీ ఉన్నతాధికారులు ఈ విషయమై చర్చలు జరపడంతో సమస్య ఒక్కరోజులోనే పరిష్కారమైంది.లడఖ్-టిబెట్ మధ్య ఉన్న పాంగాంగ్ సరస్సు తమదంటే, తమదని భారత్-చైనాలు పట్టుబడుతున్నాయి. ఇరుదేశాల మధ్య సరైన సరిహద్దు లేకపోవడంతో భారత్-చైనా సైన్యాల మధ్య తరచూ ఘర్షణలు చెలరేగుతున్నాయి.

Related posts