బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లు తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్న ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం కూడా ముగిసింది. అనుకున్నట్లుగానే ఇద్దరు జేడీఎస్ అభ్యర్థులు తెల్లజెండా ఊపారు. ఇద్దరు బీజేపీ రెబెల్స్ వెనక్కి తగ్గలేదు. శివాజీనగరలో అత్యధికంగా 19 మంది పోటీలో నిలిచారు. ప్రచారం, ప్రలోభాల పర్వం మిన్నంటబోతోంది. రాష్ట్రంలోని 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబరు 5న జరగనున్న ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. ఇప్పటివరకు రెబెల్స్ అభ్యర్థులను బుజ్జగించడం, నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేసిన పార్టీలు శుక్రవారం నుంచి ప్రచార బరిలో దిగనున్నారు.
హీరేకరూర్, అథని నియోజకవర్గాల్లో జేడీఎస్ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హావేరి జిల్లా హీరేకరూర్‌లో అభ్యర్థి శివలింగ శివాచార్య స్వామిజీ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అథణిలో ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవది జరిపిన చర్చల తర్వాత జేడీఎస్ అభ్యర్థి గురుదాస్యల్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక బీజేపీ రెబెల్స్ శరత్ బచ్చేగౌడ (హొసకోటె), కవిరాజ్ అరస్ (హొసపేటె)లు వైదొలగకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. చివరకు 15 స్థానాలకు 165 మంది రంగంలో మిగిలారు.
ప్రపంచ కప్ గెలవకపోతే… తాను నిరాశకు గురవుతా: అజార్