telugu navyamedia
రాజకీయ

భారత్‌ సరికొత్త రికార్డు.. సాయంత్రానికి 2కోట్ల టీకాలు పంపిణీ

దేశంలో నేడు కరోనా టీకాల పంపిణీ కార్యక్రమం శరవేగంగా దూసుకెళ్తోంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా 2కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశారు. వ్యాక్సినేషన్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా శుక్రవారం భారీఎత్తున కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టాలని బీజీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అర్హులైన ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని, అదే మోడీకి ఇచ్చే అసలైన కానుక అవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు. ఈ క్రమంలో నేడు టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది.

సాయంత్రం 5.10 గంటల సమయానికి డోసుల పంపిణీ 2కోట్లు దాటింది. రాత్రి వరకు 2.5కోట్ల డోసులను పంపిణీ చేయొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఒక రోజులో రెండు కోట్లకు పైగా టీకాలను పంపిణీ చేయడంతో భారత్‌ వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 78కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. వచ్చే నెల నాటికి 100కోట్ల డోసులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Related posts