వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని , అప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు .
1948 సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్రం భారత్ లో విలీనమైంది .
నిజామ్ పాలనకు చరమ గీతం పాడి అప్పటి హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణను మిలిటరీ చర్య ద్వారా విమోచనం కలిగించారు. దేశానికి 1947 ఆగష్టు 15న స్వాతంత్రం లభిస్తే తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17నే వచ్చింది . అయితే ఆ రోజును స్వాతంత్ర దినోత్సవం లేదా విమోచన దినోత్సవంగా అధికారంలోకి వచ్చిన పార్టీలు నిర్వహించడం లేదు , కారణం ఓటు బ్యాంకు రాజకీయాలే .
దీనిపై అధికారంలో వున్న టి .ఆర్ .ఎస్ కూడా ఉదాసీనంగానే ఉంటోంది . కె .సి .ఆర్ మీద బి ,జె .పి వత్తిడి తెస్తున్నా సెప్టెంబర్ 17ను మాత్రం విమోచన దినంగా ప్రకటించడంలేదు , ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదు . ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు . అధికారంలోకి వచ్చాక దాని సంగతే మర్చిపోయారు .
ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు , తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా నిర్మల్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సంచలన ప్రకటన చేశారు .
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడు సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినం లేదా తెలంగాణ కు స్వాతంత్రం వచ్చిన రోజుగా గుర్తించి అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు . ఇటీవలే టి .ఆర్ .ఎస్ కు గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరిన ఈటెల రాజేందర్ ను అమిత్ షా వేదిక మీదకు పిలవగానే సభ లో ఒక్కసారిగా హర్షధ్వానాలు చేశారు .