కరోనా వైరస్ దెబ్బతిన్న టాలీవుడ్ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. షూటింగ్ ప్రారంభం అవడంతో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు వరుసగా వస్తున్నాయి. ఇక తాజాగా మరో సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ఇదే మాథ. ఈ సినిమాను గురుపవన్ డైరెక్ట్ చేస్తున్నాడు. అంతేకాదు.. ఈ సినిమా శ్రీమతి మనోరమ గురప్ప సరమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్ పతాకంపై జి. మహేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇందులో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ రైడర్స్ గెటప్స్‌లో బైక్ మీద రైడింగ్ కి వెళుతున్నట్లు కనిపిస్తున్నారు. రోడ్ మార్గం నేపథ్యంలో సినిమా కథ సాగనుందని పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నారు. సప్తగిరి, సమీర్, సత్యం రాజేష్, శ్రీజిత ఘెష్ తదితరులు ఈ మూవీలో నటిస్తున్నారు.
previous post
next post