telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు ఉద్యోగాలు రాజకీయ వార్తలు

గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంధి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ఢిల్లీలో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ ప్రధాని మోదీ మద్దతుతో ఇది సాధ్యం అయ్యిందన్నారు. తాను చూసిన ప్రధాన మంత్రులలో మోదీ ప్రత్యేకమన్నారు.

విజినరీ, ఆలోచన తీరు, నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనను ఎవరూ అందుకోలేరని కొనియాడారు. ప్రధాని సారథ్యంలో 2047 కంటే ముందుగానే భారత దేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని స్పష్టం చేశారు.

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ , కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారం అందించారన్నారు. విశాఖపట్నానికి గూగుల్ రావడంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలిపారు.

ఈ ఒప్పందం ద్వారా గూగుల్ సుమారు 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.88,628 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది.

‘గూగుల్ ఏఐ హబ్’ పేరుతో ఏర్పాటయ్యే ఈ కేంద్రం, భారతదేశంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధస్సు కేంద్రంగా నిలవనుంది.

అమెరికా వెలుపల గూగుల్ నిర్మిస్తున్న అతిపెద్ద డేటా సెంటర్ కూడా ఇదే కావడం విశేషం.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో పాటు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే తదితరులు పాల్గొన్నారు.

ఈ భారీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతం లభించనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

2028-2032 మధ్య కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా రూ.10,518 కోట్లు అదనంగా సమకూరవచ్చని భావిస్తున్నారు.

అన్నింటికన్నా ముఖ్యంగా, ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1,88,220 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. ఈ డేటా సెంటర్ రాకతో విశాఖ నగరం పూర్తిస్థాయి ‘ఏఐ సిటీ’గా రూపాంతరం చెందనుంది.

గూగుల్ డాటా సెంటర్‌కు అన్ని విధాల ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో అనేక మార్పులు వస్తాయని పలు కంపెనీలు గూగుల్ బాటలో పయనించే అవకాశం ఉందన్నారు.

సీఎం. నైతిక విలువలతో కూడిన ఏఐ టెక్నాలజీ అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Related posts