telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నాలా పనులపై జోనల్ కమిషనర్ లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

ప్రతి రోజు మేయర్ ఆఫీస్ కు వస్తున్న ఫిర్యాదులపై జోనల్ కమిషనర్/సి.ఇ ఎస్.ఎన్.డి.పి లతో గూగుల్ మీట్ ను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నిర్వహిస్తారు. వర్షాకాలంలో ఎస్.ఎన్.డి.పి కింద నాలా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జోనల్ కమిషనర్ లకు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశాలు జారీచేశారు. వచ్చే వర్షాకాలానికి ముందుగానే అసంపూర్తిగా ఉన్న నాలా పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు జోనల్ కమిషనర్, ఎస్.ఇ సికింద్రాబాద్ చర్యలు తీసుకోవాలని తెలిపారు. సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జోనల్ కమిషనర్ లతో నాలా పనుల పై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. నల్లకుంట పద్మ కాలనీలో మూసి నాలా రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో అక్కడ పది రోజులలో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పద్మ కాలనీ, వెజిటేబుల్ మార్కెట్, ఓల్డ్ రామాలయం, ఫీవర్ హాస్పిటల్ గుండా నాలా ప్రవహిస్తుందని, నాగమయ్య కుంట నుండి పద్మ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన రిటైనింగ్ వాల్  ప్రతి సంవత్సరం వరదలతో దెబ్బతింటుంది. ఈ దెబ్బతిన్న వాల్ రీ-కన్స్ట్రక్షన్ కోసం డీ-సిల్టింగ్ అనంతరం పూర్తి చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. అకాల వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. నాలా పనులను అధికారులతో ప్రతి రోజు రివ్యూ చేస్తూ నిర్దేశిత సమయానికి ముందే పూర్తి చేయాలని తెలిపారు.

ఈ సందర్భంగా సంబంధిత జోనల్ కమిషనర్ నల్లకుంట పద్మ కాలనీలో జరుగుతున్న నాలా పనులపై మేయర్ కు వివరించారు…. ఎస్.ఎన్.డి.పి కింద నల్లకుంట పద్మ కాలనీ లో 880 మీటర్ల నాలా వెడల్పు లో రెండు స్ట్రెచ్ లో నిర్మిస్తున్నాం. ఇందులో మొదటిది పద్మ కాలనీ గురుదత్త స్కూల్ వద్ద 190 మీటర్ల పొడవు నాలాకు 71 మీటర్లు పూర్తి కాగా 119 మీటర్ల పనులు ప్రోగ్రెస్ లో ఉంది. రెండవది హెరిటేజ్ నుండి లెప్రసి హాస్పిటల్ వరకు 690 మీటర్ల నాలా వెడల్పు నకు 370 మీటర్లు పూర్తి కాగా 320 మీటర్ల పనులు ప్రోగ్రెస్ లో ఉన్నది.

ఇటీవల కురిసిన వర్షాలకు పద్మ కాలనీలో 10 మీటర్ల సి.ఆర్.ఎస్ వాల్ కూలిపోవడంతో వెంటనే పునరుద్దరించడమైనది.

పద్మ కాలనీ సమోసా పార్కు వద్ద 10 మీటర్ల సి.ఆర్.ఎస్ వాల్ ను డీ-సిల్టింగ్ కోసం తీసివేయడమైనది. ఈ పనులను డీ-సిల్టింగ్ అనంతరం పునరుద్దరిస్తామని తెలిపారు.
ఇకపై ప్రతి రోజు ఎస్.ఎన్.డి.పి వర్క్స్, ఫిర్యాదులపై గూగుల్ మీట్, కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మేయర్ తెలిపారు.

Related posts