telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగా ఫ్యామిలీకి హైపర్ ఆది దూరం… కారణం ఇదే…!?

Hyper Aadi,Shivaji Raja

గత కొన్ని రోజులుగా బుల్లితెరపై జబర్దస్త్ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఉన్నట్టుండి అకస్మాత్తుగా జబర్దస్త్ నుంచి జడ్జిగా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు తో పాటు చమ్మక్ చంద్ర కిరాక్ ఆర్టీ లాంటి బాగా ఫేమస్ అయిన టీం లీడర్స్ కూడా జబర్దస్త్ ని వదిలి వెళ్ళడం బుల్లితెర వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు నుంచి కొనసాగుతున్న జబర్దస్త్ నాగబాబు జబర్దస్త్ టీమ్ లీడర్స్ కూడా ఇప్పటికే జీతెలుగు లో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. అయితే నాగబాబుతో పాటు లోకల్ గాంగ్స్ ప్రోగ్రామ్ లోకి హైపర్ ఆది ఆటోమేటిక్‌గా వెళ్లిపోతాడని అంతా భావించారు. అయితే హైపర్ ఆది మాత్రం జబర్దస్త్ ను వదలడం లేదని తేల్చేసాడు. అంతేకాదు జనసేనతో సైతం హైపర్ ఆది రిలేషన్ మీద ఇది ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని సోషల్ మీడియా నెటిజన్లు భావిస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది అంటే మెగా అభిమానిగా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. గత ఏపీ ఎన్నికల్లో హైపర్ ఆది భీమవరంలో జనసేన అభ్యర్థిగా పోటీచేసిన నాగబాబుకు మద్దతుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమాని అయిన హైపర్ ఆది, పలుస్కిట్లలో ఆయనను ఇమిటేట్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ మద్దతు కూడా భారీగా పొందాడు. అలాగే నాగబాబుతో సైతం హైపర్ ఆదికి మంచి రిలేషన్ ఉంది. దీంతో భవిష్యత్తులో మెగా ఫ్యామిలీతో దూరం ఏర్పడే అవకాశం కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది.

Related posts