telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఇంద్ర‌కీలాద్రికి పోటెత్తిన భ‌క్తులు…

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు లో భాగంగా ఇంద్ర‌కీలాద్రికి భ‌క్తులు పోటెత్తారు. ద‌స‌రా శర‌న్న‌వ‌రాత్రుల్లో నేడు 8వ రోజు కావ‌డంతో అమ్మ‌వారు మ‌హిషాసుర‌ మ‌ర్థ‌ని దేవి ఆలంకారంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తున్నారు. రాక్ష‌సుల‌ను సంహ‌రించి స్వ‌యంభుగా వెలిసిన మ‌హిషాసుర‌ మ‌ర్థ‌ని అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు వేకువ‌జాము నుంచే భ‌క్తులు క్యూలైన్లో బారులు తీరారు.

గ‌త ఏడు రోజులుగా బెజ‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రిపై ఉత్స‌వాలు అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. శ‌ర‌న్న‌వ‌రాత్రులు రేప‌టితో (శుక్ర‌వారం)తో ముగియ‌నుండ‌టంతో అమ్మ‌వారిని ద‌ర్శ‌నం చేసుకోవ‌డానికి పెద్ద‌సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌స్తున్నారు.

రేపు విజ‌య‌ద‌శ‌మి పండుగ సంద‌ర్భంగా క‌న‌క‌దుర్గ‌మ్మ రాజ‌రాజేశ్వ‌రి దేవిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. వ‌చ్చే భ‌క్తుల కోసం దేవ‌స్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. నేడు అమ్మవారిని కొలిచిన వారికి స‌క‌ల శత్రుబాధ‌లు తొలిగి ఆనందంగా ఉంటారని ఆర్చ‌కులు చెబుతున్నారు.

Related posts