telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విశ్వక్ సేన్ నన్ను తొక్కేస్తున్నాడు… అంటూ వీడియో షేర్ చేసిన “హిట్” దర్శకుడు

Vishwak-sen

‘హిట్’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు శైలేష్ కొలను. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతోంది. ఇదిలా ఉంటే, దర్శకుడు శైలేష్ కొలను ఒక ఆసక్తికర వీడియోను శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ వీడియోలో శైలేష్‌ను హీరో విశ్వక్ సేన్ ఆటపట్టిస్తు్న్నారు. ఈ వీడియోలో విశ్వక్ సేన్ నిర్మాతగా కనిపించారు. తనకు కథ చెప్పడానికి వచ్చిన శైలేష్‌కు తనదైన శైలిలో చుక్కలు చూపించారు. ‘‘విలేజా, సిటీనా, మణికొండనా, హన్మకొండనా నేను చెప్తా.. నువ్వు కాదు’’, ‘‘18 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ నేను డిసైడ్ చేసుకుంటా. పిచ్చోళ్లమా ప్రొడక్షన్ టీమ్ పెట్టకుని’’ అని ఒకరకం మేనరిజంతో శైలేష్‌ను హడలెత్తించారు. ఈ వీడియోను ట్వీట్ చేసిన శైలేష్.. ‘‘పూరి జగన్నాథ్ సార్ ఇదొకటి నేర్పించారు మా విశ్వక్‌కి. ఇలా తొక్కేస్తున్నాడు మమ్మల్ని. బోయ్స్ చూడండ్రా మీ అన్న ఎట్లా చేస్తున్నాడో. అన్యాయం కదా?’’ అని పేర్కొన్నారు. కాగా, శైలేష్ తండ్రికి ఇండస్ట్రీలో ప్రొడక్షన్ మేనేజర్‌గా సుధీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన దిల్ రాజు వద్ద ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు అదే దిల్ రాజు బ్యానర్‌లో శైలేష్ బాలీవుడ్ సినిమా చేస్తున్నారు. ‘హిట్’ మూవీని శైలేష్ కొలను దర్శకత్వంలో హిందీలో రీమేక్ చేస్తున్నారు. రాజ్‌కుమార్ రావు హీరో. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది.

Related posts