telugu navyamedia
సినిమా వార్తలు

క్లైమాక్స్ సీన్ చిత్రీకరిస్తున్న టైమ్ లో గాయపడ్డ హీరో విశాల్‌..షూటింగ్ వాయిదా..

*షూటింగ్ లో విశాల్‌కు గాయాలు
*చికిత్స కోసం కేర‌ళ వేళుతున్న హీరో..
*లాఠీ’ సినిమా క్లైమాక్స్ చిత్రీకరిస్తున్న సమయంలో గాయాలు..
*షూటింగ్ ను మార్చి నెలకు వాయిదా

కోలీవుడ్ హీరో విశాల్ షూటింగ్ లో గాయపడ్డారు. హైదరాబాద్ లో ‘లాఠీ’ సినిమా క్లైమాక్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన గాయపడినట్లు తెలుస్తోంది. విలన్ బారి నుంచి చిన్నారిని కాపాడే సీన్‌ భాగంగా హీరో బిల్డింగ్ మీద నుంచి దూకాలి. ఈ క్రమంలో అతడి చేతికి, నుదుటికి గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో విశాల్ షూటింగ్ కి బ్రేక్ చెప్పి ట్రీట్మెంట్ కోసం కేరళకు వెళ్లారు.

Vishal injured in Laththi shooting shocking video – தமிழ் News - time.news  - Time News

చేతికి చిన్న ఫ్రాక్చర్స్ కావడంతో షూటింగ్ ను మార్చి నెలకు వాయిదా వేశారు. ఈ విషయాన్ని విశాల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. చేతికి ఫ్రాక్చర్‌ అయినందున ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. తిరిగి మార్చి మొదటివారంలో ఫైనల్‌ షెడ్యూల్‌లో పాల్గొంటానని తెలిపాడు. ఆయనకు ఎలా గాయమైందో వీడియో కూడా షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది..

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ‘లాఠీ’ సినిమాలో విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. సునయన హీరోయిన్ గా నటిస్తుండగా.. వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రమణ, నంద కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Related posts