telugu navyamedia
సినిమా వార్తలు

‘అనుభవించు రాజా’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌..

యంగ్ టాలెంటెడ్ హీరో రాజ్‌ తరుణ్‌ తాజా చిత్రం ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ బయటకు వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం టైటిల్‌ను ‘అనుభవించు రాజా’గా ఖరారు చేశారు చిత్ర బృందం.

‘అనుభవించు రాజా’ చిత్రం. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. ‘అనుభ‌వించు రాజా’ టైటిల్ సౌండింగే చాలా డిఫ‌రెంట్‌గా అనిపిస్తోంది. ఇందులో రాజ్‌ తరుణ్‌ కోడిపుంజుతో పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు.

అలాగే అతని లుక్, డ్రెస్సింగ్ చూస్తుంటే పందెం రాయుడిలాగా క‌నిపిస్తున్నాడు. చేతి వేళ్ళకు బంగారు ఉంగ‌రాలు, మణికట్టుకు బ్రాస్‌లెట్ వేసుకుని ఉన్నాడు. కోడి పందాలు, జూదం ఆడే వ్య‌క్తిలా క‌నిపిస్తున్న రాజ్‌త‌రుణ్ త‌న కోడితో యమ సరదాగా ఫోజిచ్చాడు. 

ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌ సరసన మోడల్ కాషిశ్‌ ఖాన్ నటించింది. ఈ చిత్రంలో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. కాషిష్ ఖాన్ మరో తెలుసు సినిమా ‘కిన్నెరసాని’లోనూ నాయికగా నటిస్తోంది. ఎలాంటి హాడావుడి లేకుండా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.

 

‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో రాజ్ తరుణ్ ను హీరోగా పరిచయం చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ వారు, మళ్లీ ఇప్పుడు ఆయనతో ఈ సినిమాను చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో రాజ్‌ తరుణ్‌కు ఇది మూడో సినిమా కాగా, దర్శకుడుకు శ్రీనివాస్‌తో అతడికి రెండవ చిత్రం కావడం విశేషం.

Raj Tarun opens up on his accident: Took a quick run to go back home and get some help - Movies News

గతంలో రాజ్ తరుణ్ తో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ మూవీని తెరకెక్కించిన శ్రీను గవిరెడ్డి దీన్ని డైరెక్ట్ చేశాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీ ‘అనుభవించు రాజా’కు గోపీసుందర్ సంగీతాన్ని, నగేశ్ బానెల్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పూర్తి అప్ డేట్స్ కోసం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

యువ నటుడు రాజ్​తరుణ్​ తన కొత్త సినిమాను ప్రకటించాడు. ‘అనుభవించు రాజా’తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అన్నపూర్ణ స్డూడియోస్​, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్​పీ​ ఈ మూవీని నిర్మించనున్నాయి. ఈ చిత్రంలో ‘బంగారం’ పాత్రలో రాజ్​తరుణ్​ను పరిచయం చేస్తూ కింగ్​ నాగార్జున టైటిల్ పోస్టర్​ను విడుదల చేశారు.

Related posts