telugu navyamedia
సినిమా వార్తలు

“మగధీర”కు అప్పుడే పదేళ్ళు పూర్తి

Magadheera

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం జూలై 31,2009న విడుద‌లైంది. నేటితో ఈ చిత్రం విడుద‌లై ప‌దేళ్ళు పూర్తి చేసుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ “మ‌గ‌ధీర” సినిమాతో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 17వ శతాబ్దంలో జ‌రిగిన క‌థ‌తో మ‌గ‌ధీర చిత్రం మొద‌లు కాగా ఇందులోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయి. ఫాంట‌సీ చిత్రంగా రూపొందిన మ‌గ‌ధీర‌లో రాకుమారిగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ఆమె అంగరక్షకుడు, ప్రేమికుడు ఐన కాలభైరవ గా రామ్‌చరణ్ తేజ్, షేర్ ఖాన్ పాత్ర‌లో శ్రీహరి త‌మ న‌ట‌నా నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. కాలభైరవ రక్షణ కవచానికి చితి అంటించి, దిగిపోతున్న సూర్యుణ్ణి చూస్తూ “కమ్ముకొస్తున్న చీకటిని చీల్చుకుంటూ మళ్ళీపుడతావురా భైరవా…” అంటూ శ్రీహ‌రి చెప్పిన డైలాగ్… “ఒక్కొక్కన్ని కాదు షేర్ ఖాన్ ఒకేసారి వందమందిని పంపించు…” అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ ఇప్ప‌టికీ హైలైట్ అని చెప్ప‌వ‌చ్చు. ఇక ఈ సినిమా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామ్ చ‌ర‌ణ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో మ‌గ‌ధీర చిత్రానికి సంబంధించిన ప‌లు పోస్ట‌ర్స్ షేర్ చేస్తూ.. మ‌గ‌ధీర చిత్రం విడుద‌లై ప‌దేళ్లు అయిందంటే న‌మ్మ‌లేకుండా ఉంది. రీసెంట్‌గా ఈ చిత్రం విడుద‌లైన‌ట్టు అనిపిస్తుంది. మ‌గ‌ధీర చిత్ర టీం, కీరవాణి, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, గీతా ఆర్ట్స్‌కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. రాజ‌మౌళి నుండి చాలా నేర్చుకున్నాను. ఇప్ప‌టికీ ఆయ‌న నుండి ఎంతో నేర్చుకుంటున్నాను అని చ‌ర‌ణ్ త‌న పోస్ట్‌లో పేర్కొన్నాడు.

Related posts