telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ దంచికొడుతున్న వ‌ర్షాలు..

గ‌త కొద్ది రోజుల‌గా ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కొనసాగుతోందిని.. దీనివలన ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో వర్షాల తీవ్రత పెరుగుతుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.

నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల మధ్య పుదుచ్చేరి – చెన్నై సమీపంలో తీరందాటిందని తెలిపింది.

వాయుగుండం ప్రభావంతో చిత్తూరు, కడప​, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో రానున్న రెండు మూడు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అంతేకాదు ఈ జిల్లా వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని .. లోతట్టు ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లమని సూచించింది.

తీరంవెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని , మత్య్సకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశించారు. కాగా, ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకుని సహయ కార్యక్రమాలు చేపట్టాయని అధికారులు తెలిపారు.

Related posts